విత్తనశుద్ధి :
ముందుగా ప్రతి కిలో విత్తనానికి 2 గ్రాముల థైరమ్ + 1 గ్రాము కార్బoడైజిమ్ లేదా 3 గ్రాముల థైరమ్ లేదా కప్ట్టాన్ మండుతోను, తరువాత 5 గ్రా. ఇమిడాక్లోప్రిడ్ లేదా 30 గ్రా. కార్బోసుల్ప్హన్ తో విత్తనశుద్ది చేయాలి. ప్రతి 8-10 కిలోల విత్తనానికి 200 గ్రా. రైజోబియం జపానికం కల్చరును కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.